![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -337 లో.. అనామిక పొగరుగా మాట్లాడేసరికి అప్పుకి కోపం వస్తుంది. నేను ఇప్పుడు కావాలని అనుకున్నా కళ్యాణ్ ని సొంతం చేసుకోగలను.. నా ప్రేమలో అంత నిజాయితీ ఉంది. కళ్యాణ్ మంచివాడు బాగా చూసుకోమని అప్పు అంటుంది. ఆ తర్వాత ఇంక కావ్య రాలేదని రాజ్ అటు ఇటు తిరుగుతుంటాడు. ఏంటి రాజ్.. కావ్య వాళ్ళ బావని తీసుకోని వస్తుంటే జెలస్ గా ఉందా అని శ్వేత అడుగుతుంది. అదేం లేదని రాజ్ కవర్ చేస్తాడు.
అప్పుడే కావ్య తన బావని తీసుకొని ఆఫీస్ కి వస్తుంది. వీడు ఏంటో అనుకున్న కానీ బానే ఉన్నాడని రాజ్ అనుకుంటాడు. రాజ్ జెలస్ ఫీల్ అవ్వాలని కావ్య కావాలనే తన బావతో క్లోజ్ గా ఉంటుంది. బుజ్జి బుజ్జి అంటూ కావ్యని వాళ్ళ బావ పిలుస్తుంటే రాజ్ చూడలేకపోతాడు. కావ్య తన బావని రాజ్ కి పరిచయం చేస్తుంది. అన్నయ్య అని అతను రాజ్ ని పిలుస్తుంటే రాజ్ చిరాకు పడతాడు. అయిన నువ్వు చాలా అదృష్టవంతుడివి బుట్టబొమ్మ లాంటి నా బుజ్జిని పెళ్లి చేసుకున్నావని వాళ్ళ బావ అంటాడు. మీరు గాని పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే నేను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకొని వెళ్లి పోయేవాణ్ణి అని కావ్య వాళ్ళ బావ అంటాడు. నిన్ను చేసుకోవడం ఇష్టం లేక స్వప్న పారిపోయినట్లు.. నా బుజ్జి కూడా పారిపోతే బాగుండు అనేసరికి రాజ్ కి కోపం వస్తుంది. ఇక రాజ్ తన ఫ్రస్ట్రేషన్ ని స్టాఫ్ పై చూపిస్తాడు. మన జ్ఞాపకాలు అని నెమరువేసుకుందామని వాల్ల బావతో కావ్య అంటాడు. దానికి రాజ్ కూడా.. పదా శ్వేత మన కాలేజీ విషయాలు నెమరువేసుకుందామని అంటాడు.
ఆ తర్వాత కావ్య తన బావ కలిసి క్యాబిన్ కి వెళ్లి మాట్లాడుకుంటారు. అసలు మనం చేస్తుంది కరెక్ట్ ఏనా అని వాళ్ళ కావ్యతో వాళ్ళ బావ అంటాడు. ఇప్పుడు చూసావ్ కదా బావ ఎలా జెలస్ గా ఫీల్ అవుతున్నాడో అని కావ్య అంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని రాజ్ వల్ల క్యాబిన్ దగ్గరికి వచ్చి చాటుగా వింటు ఉంటాడు. కావ్య రాజ్ వినడం చూసి కావాలనే తన బావతో క్లోజ్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత కావ్య వెళ్లి డోర్ తియ్యగానే దానికి ఆనుకుని వాళ్ళ మాటలు వింటున్న రాజ్ కిందకి పడుతుంటాడు. వెంటనే కావ్య పట్టుకుంటుంది.. ఆ తర్వాత రాజ్ తన క్యాబిన్ కి వచ్చి.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని అనగానే.. నీకు ఏమైంది రాజ్.. నువ్వు వద్దని అనుకుంటున్నావు. తను ఎవరితో క్లోజ్ గా ఉంటే నీకేంటి అని శ్వేత అంటుంది. ఆ తర్వాత రాజ్ కావాలనే శ్వేతకి విడాకులు వచ్చాయ.. ఫ్రీడమ్ వచ్చింది అంటూ కేక్ కట్ చెయ్యమని చెప్తాడు. తరువాయి భాగంలో కావ్య తన బావతో బయటకు వెళ్లడానికి పర్మిషన్ అడుగుతుంది. రాజ్ జెలస్ గా ఫీల్ అవుతు, మొదట వద్దని చెప్పినా ఆ తర్వాత పర్మిషన్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |